తడి ,పొడి చెత్తను వేర్వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ కోరారు . శుక్రవారం నాడు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఐదవ వార్డులో తడి ,పొడి చెత్త వేరువేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అందించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.