పాణ్యం: ఓర్వకల్ మండలం గుమ్మితం తండా గ్రీన్ కో రిన్యూవబుల్ ప్రాజెక్ట్ను పరిశీలన : జిల్లా కలెక్టర్ సిరి
ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను మంగళవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సందర్శించారు. ప్రాజెక్ట్ ప్రాంతంలోని రిజర్వాయర్, పవర్హౌస్, టర్బైన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన ఆమె, 6680 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ పనితీరుపై గ్రీన్ కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.