అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట 5వ సచివాలయం వద్ద గురువారం మధ్యాహ్నం 3:15 సమయంలో టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ టిడిపి రైతు సంఘం అధ్యక్షుడు నారాయణస్వామి తదితరులు 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జింక సూర్యనారాయణ నారాయణస్వామి తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతోనే 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగిందని ప్రతినెల పరిటాల సునీత అమరావతికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రిలీజ్ చేసి తీసుకువస్తున్నారని పేద ప్రజలకు ఎమ్మెల్యే పరిటాల సంత ఎప్పుడు అండగా ఉంటారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు.