పత్తికొండ: వెల్దుర్తి లో మహిళ దారుణ హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
వెల్దుర్తిలో దారుణ హత్య జరిగింది. బుధవారం సాయంత్రం పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ముస్లిం మహిళ ఉజ్మాను(36) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.