పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి సమీపంలో సీఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దిమ్మగుడి వంక నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. ఎక్కడైనా ఇసుక, మట్టి అక్రమంగా రవాణా జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.