మంత్రాలయం: వైసిపి కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటాం : పెద్ద కడబూరు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి
పెద్ద కడబూరు :మండలం కంబళదిన్నెకు వైసీపీ కార్యకర్త బోయ బజారి సతీమణి మారెక్క సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈయనతో పాటు వైసిపి నాయకులు ఆమెకు నివాళులర్పించారు.