రామవరం సత్రం భూమిలో అక్రమ కట్టడాలు, అసాంఘిక కార్యక్రమాలు. కన్నెత్తి చూడని అధికారులు
జగ్గంపేట మండలం కాట్రావులపల్లి లో ఉన్న పాముగంటి లక్ష్మి వెంకయ్య అమ్మవారి సత్రం కు సంబంధించిన భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కూడా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అలాంటి సంఘటన జగ్గంపేట మండలం రామవరం హైవే ఆనుకుని ఉన్న సర్వే నంబరు 50లోని సత్రం భూమి 12.50 సెంట్లను రైతు గుర్రాల వెంకటరమణ రెండేళ్లకు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే సాగు చేస్తున్న భూమి వద్ద అక్రమంగా పశువుల షెడ్డు నిర్మించడంతో పాటు అక్కడ అసాంఘి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.