ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో పుట్టపర్తిలో సమ్మెకు దిగినట్లు స్పష్టం చేసిన జూనియర్ డాక్టర్లు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. మూడుసార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి దిగినట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మా ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించినప్పటికీ అందుకు తగిన గుర్తింపు మాకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో 99 ని రద్దుచేసి ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు