గుంతకల్లు: మండలంలోని నక్కనదొడ్డి బస్టాండ్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో హోటల్ దగ్ధం, రూ.3లక్షలు నష్టం, ఆదుకోవాలని కోరుతున్న బాధితుడు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని నక్కనదొడ్డి గ్రామ శివారులో బస్టాండ్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి హోటల్ దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని నక్కినదొడ్డి శివారు బస్టాండ్ వద్ద బోయ కేశవ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. విద్యుత్ తీగలు పూర్తిగా కలసిపోయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి హోటల్ తో పాటుగా వెనకాల ఉన్న ఇంట్లోని వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, దుస్తులు, తిను బండారాలు పూర్తిగా కాలిపోయి రూ.3లక్షలు నష్టం వాటిల్లింది.