పలమనేరు: ఆర్టీసీ డిపో కార్యాలయ వర్గాలు సోమవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. RTCబస్టాండ్లో డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బస్టాండ్ ఏరియాలో, మరుగుదొడ్లు నిర్వహణలో అపరిశుభ్రత, టు వీలర్ పార్కింగ్, ఫ్యాన్సీ, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ షాపులలో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుండి ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.