అసిఫాబాద్: గంజాయి సాగు కేసులో వాంకిడి మండలానికి చెందిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష
గంజాయి సాగు చేస్తూ అరెస్టు అయిన నిందితునికి ASF జిల్లా కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. వాంకిడి మండలం సోనాపూర్ కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు విన్న జిల్లా జడ్జి రమేష్ నేరం రుజువు కావడంతో నిందితునికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.