శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం టెక్కలి కేంద్రంగా ఏర్పాటు చేసిన IMLకొత్త డిపోను తక్షణమే రద్దు చేయాలి:CPM జిల్లా కార్యదర్శి గోవిందరావు
టెక్కలి కేంద్రంగా ఐఎంఎల్ కొత్త డిపో ఏర్పాటును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ... మంగళవారం ఎచ్చెర్ల మండల కేంద్రంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి గోవిందరావు నిరసన చేపట్టారు. ఎచ్చర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి... కోట్లాది రూపాయల విలువ గల భూమిని ఎటువంటి నష్టపరిహారం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేడు ఐ ఎం ఎల్ డిపో కార్మికుల పొట్ట కొట్టడం సరికాదన్నారు.