కడప జిల్లా కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డిపర్యటించి చదిపిరాళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యాలయం ద్వారా రైతులకు మెరుగైన సహకార సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్య నారాయణ రెడ్డి, డీసీఓ ఎం. వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు, సొసైటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.