గుంతకల్లు: పట్టణంలో ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్ట్, 2.5 కిలోల గంజాయి స్వాధీనం, గుంతకల్లు వన్ టౌన్ సీఐ మనోహర్ వెల్లడి
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఆసుపత్రి సమీపంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం గుంతకల్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా పట్టణంలోని రైల్వే ఆసుపత్రి సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందింది. పక్కా సమాచారంతో వన్ టౌన్ సీఐ మనోహర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.