గోకవరం: ప్రజలకు రెవెన్యూ సేవలు అందించే విషయంలో అధికారులు జవాబుదారీతనంతో ఉండాలి: కలెక్టర్ ప్రశాంతి
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు రెవిన్యూ సేవలు అందించే క్రమంలో ఉద్యోగులు జవాబుదారుతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెసి చిన్న రాముడు డిఆర్ఓ సీతారామమూర్తితో కలిసి మండల రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించి మండల స్థాయి అధికారుల పనితీరు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడంలో పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.