మేడ్చల్: అల్విన్ కాలనీలో స్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ హిందూ స్మశాన వాటిక సుందరీకరణ పనులను పగడ్బందీగా పూర్తి చేయిస్తామని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఇవాళ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా 49 లక్షల వ్యయంతో చేపడుతున్న బర్నింగ్ ప్లాట్ఫార్మ్స్ స్లాబ్ నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.