జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీగంగానమ్మకు కోటి నలభై లక్షలు కరెన్సీతో అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ
Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహలక్ష్మీ అలంకారంలో భక్తులకి దర్శనం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీగంగానమ్మ అమ్మవారిని సుమారు మూడు కోట్ల రూపాయలతో 500, 100నోట్లతో మహాలక్ష్మి అలంకరణ చేశారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా కోటి నలభై లక్షల రూపాయలు తో మహాలక్ష్మి అలంకరణ చేశారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న దేవతా మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారు. ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలలో మహిళలు పాల్గొన్నారు.