గాజువాక: వేతనాలు చెల్లించాలంటూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కంచాలతో నిరసన తెలియజేసిన మహిళలు
విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట కంచాలు కొట్టి తమ నిరసనలు ఉక్కు కార్మికులు, ఉక్కు మహిళలు తెలియజేశారు. ధర్నాకు అధ్యక్షులుగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటిదాస్ వ్యవహరించారు.ఈ ధర్నా ను ఉద్దేశించి జె అయోధ్య రామ్ మాట్లాడుతూ ఉక్కు కార్మికులకు జీతాలు చెల్లించామని కేంద్ర కేంద్రీ మంత్రి చెప్పటం సిగ్గుచేటు అని అన్నారు.