తనకల్లులో రోడ్డుపై అదుపుతప్పి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలో సోమవారం తనకల్లు మండలం ముల్లోళ్లపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సహాయంతో అతడిని తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.