పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ కుట్ర పన్నుతోంది: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్
బాబు
ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ లేనిపోని బురద జల్లుతోందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ, కుల, మతాలకు అతీతంగా ప్రజలకి పవన్ కళ్యాణ్ సేవ చేస్తుంటే రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వైసీపీ పవన్ పై కుట్ర పన్నుతుందని లాజరు బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేస్తున్నారన్నారు.