అదిలాబాద్ అర్బన్: దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మావల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ను రూ.6 వేలకు పెంచాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మావల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తమ హామీని నిలబెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.