త్రావగుంట రహదారిపై ఆగని మురుగునీటి ప్రవాహం ఇబ్బంది పడుతున్న వాహనదారులు గ్రామస్తులు
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని త్రాగుంట వద్ద రహదారిపై వర్షపు నీరు ఆగి ఆరకపోవటంతో స్థానిక ప్రజలు మరియు వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. రహదారిపై పడిన వర్షపు నీరు అక్కడే ఆగిపోవడంతో దోమల బెడద ఎక్కువై స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలు నుండి చీరాల వెళ్లేటువంటి ప్రధాన రహదారి మూల మలుపు వద్ద ఈ వర్షపు నీరు ఆగిపోయి ఉండటంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికి నగరం కార్పొరేషన్ అధికారులకి ఎన్నిసార్లు తెలియచేసినప్పటికీ ఆ మురుగునీటిని బయటకు పంపించే ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులతో పాటు గ్రామస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు