భువనగిరి: భువనగిరి శివారు రాయగిరిలో లారీ బీభత్సం.. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారు రాయగిరి యాదగిరిగుట్ట కమాన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట వైపు నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న షాపులోకి దూసుకు వెళ్ళింది. డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.