పిచ్చాటూరు మండలం నల్లచెరువు కాలువ తూము షట్టర్లు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
పిచ్చాటూరు: తూము షట్టర్లు ధ్వంసం పిచ్చాటూరు మండలం రామగిరి వంతెన సమీపంలోని నాగలాపురం నల్లచెరువు కాలువకు రెండు తూములు అమర్చారు. రైతులు తమకు కావలసిన నీటిని షట్టర్ల ద్వారా వాడుకుంటున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెండు తూములకు అమర్చిన ఇనుప షట్టర్లను పగలగొట్టి నీటిలో పడవేశారు. నీటి సంఘ అధ్యక్షుడు సెల్వకుమార్ తమ గ్రామస్థులను నీటిలో దింపి వెతకడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తూముల ద్వారా నీరు వృథాగా పోతోంది.