నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని LIC ఆఫీస్ రోడ్‌కు చెందిన వైయస్సార్ పార్టీ మైనార్టీ నాయకుడు, 97వ బూత్ కమిటీ కన్వీనర్ జున్ను మాబుసా (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.