జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేశారు.పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలలోని కూడళ్ళు జాతీయ/రాష్ట్రీయ రహదారులపై ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేశారు.ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు.పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు.రోడ్డు భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసుల చర్యలు తప్పవని హెచ్చరించారు.