పత్తికొండ: పత్తికొండలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కూటమి ప్రభుత్వం పై విమర్శలు
పత్తికొండలో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నేతృత్వంలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే నివాసం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, 'ప్రైవేటీకరణ రద్దు చేయాలి - విద్య మన హక్కు' అని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.