పులివెందుల: ఇడుపులపాయ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ లో ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాం
Pulivendla, YSR | Sep 21, 2025 ఇడుపులపాయ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ప్రాంగణంలో నేడు NSS యూనిట్ 14 ఆధ్వర్యంలో ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సైకాలజి కౌన్సిలర్ డాక్టర్ ఎమిలిన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శారీరిక &మానసిక సమస్యలు ఉంటాయన్నారు. శారీరిక సమస్యలను గుర్తించగలము కానీ మానసిక సమస్యలను ఎవరికి వారు గుర్తించలేరన్నారు. ముఖ్య మానసిక సంఘర్షణ & డిప్రెషన్ కు గురి అయిన వారు అతిగా తినడం లేదా అసలే తినకపోవడం, నిద్ర లేక రాత్రింబవళ్లు తిరుగుతూ ఉండడం, ఉంటాయన్నారు.