పలమనేరు: వైసీపీ నాయకులపై సెటైర్లు వేస్తూ విమర్శలతో విరుచుకుబడిన టిడిపి నేతలు,
పలమనేరు: మున్సిపల్ పరిధిలో గత రెండు రోజులుగా జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన అంశంపై చెలరేగిన ఈ వ్యవహారం ఇరు పార్టీల నేతల వాదోపవాదాలకు కారణమైంది. ఇలా ఉండగా వైకాపా నేతలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ తెలుగు తమ్ముళ్లు సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నాయకులు తీవ్ర ఆరోపణలు చేసి సెటైర్లు వేశారు.