పూతలపట్టు: పాలేరు ఫ్లైఓవర్ వద్ద టాటా పికప్ వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టిన ఐచర్ వాహనం
టాటా పికప్ వాహనాన్ని వెనక నుండి ఢీకొట్టిన ఐచర్ వాహనం తప్పిన ప్రమాదం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాల్యం మండలంలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారి పాలేరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో చిత్తూరు వైపు వస్తున్న టాటా పికప్ వాహనాన్ని ఐచర్ వాహనం వెనుక నుండి ఢీ కొట్టింది దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరికి ఇలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.