మేడ్చల్: కూకట్పల్లిలో బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో దీపావళి వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సోమవారం బేగంపేట ప్రకాష్ నగర్ లోని దేవన బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంద విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు. వారితో కలిసి బాణాసంచా కాల్చి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ సాధించాలని పట్టుదల ఉంటే అంగవైకల్యాన్ని అధిగమించవచ్చని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని సూచించారు.