కలవకూరు డ్యామ్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి జిల్లా నాయుడుపేట కలవకూరు డ్యామ్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఎస్పీ సుబ్బరాయుడు పర్యటించారు. స్థానిక పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి, తక్షణ చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. వాగులు, వంతెనలు, చెక్ డ్యాంల వద్ద 24 గంటల పహారా ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పహారాలను బలోపేతం చేయాలన్నారు. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినచో వెంటనే తొలగించాలని చెప్పారు.