మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసినదే. అదేవిధంగా ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో ఆ వ్యక్తులను హాస్పటల్ కి చేర్పిస్తే ప్రభుత్వం 5000 రూపాయలు ప్రోత్సహం అందిస్తుందని మార్కాపురం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు తెలిపారు. చాలామంది ప్రమాదాలను చూసి కూడా కేసులు అవుతాయని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అన్నారు. ఇదివరకు లాగా కాపాడిన వారిపై కేసులు ఉండవని ధైర్యంగా ముందుకొచ్చి కాపాడాలన్నారు.