పూతలపట్టు: యాదమరి మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించిన ఎక్స్చేంజ్ Dc విజయ్ శేఖర్ జిల్లా వ్యాప్తంగా మద్యం షాపు యాజమాన్యాలకు హెచ్చరిక
పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండల పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మద్యం షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇకపై ప్రతి మద్యం బాటిల్‌పై QR స్కానర్ కోడ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.