లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలను పరామర్శించిన నగర మేయర్ గంగాధర సుజాత
Ongole Urban, Prakasam | Oct 22, 2025
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయువున్నంగా మారడంతో గడిచిన 12 గంటలుగా ఒంగోలు నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం వలన నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలైన రిమ్స్ మెయిన్ రోడ్ మరియు మదర్ తెరెసా కాలనీ, నేతాజీ కాలనీ లను బుధవారం నగర మేయర్ గంగాడ సుజాత సందర్శించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పలకరించి వారి యొక్క అవసరాలను కనుగొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు మదర్ తెరిసా కాలనీ నందు ఇంక్రోచ్మెంట్స్ లను తొలగించి నీటిని ప్రవహింప చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కే వెంకటేశ్వర్లు MRO మధుసూదన్ గారు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు