దర్శి: ఏ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ
Darsi, Prakasam | Sep 15, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. దర్శి గడియారం ఖమ్మం సెంటర్ నుండి ప్రధాన వీధులలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దర్శి మండల ఏపీటీఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.