మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం కూచిపూడి నృత్యాలయా గురువు శ్రీమతి సత్యవతి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మహా గణపతిమ్, కృష్ణ శబ్దం, కొలువైతివా , దశావతరాలు, అదిగో అల్లదిగో, శివాష్టకం, జతిస్వరం, శివస్తుతి, ముద్దుగారే యశోద, జగదానంద కారక అంశాలను రిషిక, లహరిక, వల్లి, అనన్య, సమన్విత, వైష్ణవి, ఆశ్రిత, హారిక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.