కోడుమూరు: కల్లపరి లో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు మండలంలోని కల్లపరి గ్రామంలో శనివారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి రవి ప్రకాష్ ప్రభుత్వం సంకల్పించిన పంచ సూత్రాలు వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిందన్నారు. అనంతరం ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. గ్రామంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది.