పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో కామధేను వాహనసేవ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 19వ రోజు కామధేను వాహనసేవ వైభవంగా నిర్వహించారు. సిద్ధి–బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు కామధేను వాహనంపై ఆలయ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంగా జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, కామధేను వాహన ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.