సీఎం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించనున్న నేపథ్యంలో కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. పెన్షన్ల పంపిణీ, సభా కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు.