సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు
సురుటుపల్లిలో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఘనంగా జరిగింది. వాల్మీకేశ్వర స్వామికి అన్నాభిషేకం చేశారు. మహిళలు ప్రమిదలలో నేతి దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వాల్మీకేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్ వివిధ అభిషేకాలు చేసి స్వామిని అన్నం, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఛైర్మన్ పద్మనాభ రాజు, ఈవో లత పాల్గొన్నారు.