సత్తుపల్లి: బేతుపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ పూరిల్లు దగ్ధమైంది.బేతుపల్లి గ్రామంలో నివాసముంటున్న రమేష్ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంటి నుండి మంటలు వ్యాపిస్తూ ఉండటంతో గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రమేష్ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో సుమారు 50 వేల రూపాయలు మేరా ఆస్తి నష్టం జరిగినట్లు రమేష్ తెలిపారు.