తాడిపత్రి: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యాడికి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక
యాడికి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇద్దరు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం సీతారామాంజనేయులు గురువారం చెప్పారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మణికంఠ, పదవ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ లు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రకళ, శివశంకర్ లు అభినందించారు.