నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఆధ్వర్యంలో విద్రోహ దినోత్సవం
Nirmal, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఆధ్వర్యంలో విద్రోహ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాడిన 4000 వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి, నాయకులు అక్బర్, గంగన్న, లక్ష్మణ్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.