ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మంగళవారం బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయాలలో బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి బాగా చదువుకోవాలని పోలీసులు సూచించారు. బాలికలకు.18 సంవత్సరాల దాటకుండా వివాహం చేసుకున్న వారికి వివాహం చేసిన వారికి జైలు శిక్ష తప్పదని డయల్ 100 ద్వారా బాలికలు సహాయాన్ని అందిస్తే వారికి పోలీసుల నుంచి సహాయం అందుతుందని పోలీసులు తెలిపారు.