నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మధ్య పులుల రాకపోకలు నిరంతరం జరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులకు క్రితం కృష్ణానదిని ఓ పెద్దపులి రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ తెలంగాణలోని కొల్లాపురం ప్రాంతంలోని పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ రేంజ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్మకూరు రేంజ్ అటవీ సిబ్బంది కలిసి సంయుక్త చర్యలు చేపట్టారు. సంగమేశ్వరము–సోమశిల,శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ పరిసరాల్లో , రైతులకు మత్స్యకారులకు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.