కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో అయ్యప్ప గురు స్వాముల సమక్షంలో సోమవారం రాత్రి పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వాములు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణం శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలదారులు పడిపూజకు హాజరయ్యారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.