ఇబ్రహీంపట్నం: షాద్నగర్ లో గొర్రెలు మేకల దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన ఏసిపి లక్ష్మీనారాయణ
షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీపి లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం గొర్రెలు దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగల ముఠా పరిగి కర్ణాటక హైదరాబాదులోని పలు ప్రాంతాలకు చెందిన వారు కార్లలో తిరుగుతూ మేకలు ఎక్కడున్నాయో వెతికి డీసీఎంలలో తీసుకెళ్లి అమ్మేస్తున్నారని అన్నారు. సోలిపూర్ లో దొంగతనానికి పాల్పడుతుండగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.