ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శైలజ పర్యటించారు. సఖి వన్ స్టాఫ్ సెంటర్, బాలసదన్ ను ఆమె సందర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం సరిగా అందుతుందా లేదా అని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఆమె అన్నారు.