తడిసి ముద్దవుతున్న సూళ్లూరుపేట
- గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేట, పెళ్ళకూరు, తడ, ఓజిలి, దొర వారి సత్రం మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరాయి. బుధవారం కురిసిన వర్షంతో సూళ్లూరుపేట పట్టణం తడిసి ముద్దయింది. ప్రజలు, చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు